పినపాక: 9వ రోజుకు చేరిన ఐకెపి వీవోఏల రిలే నిరాహార దీక్షలు

0చూసినవారు
పినపాక: 9వ రోజుకు చేరిన ఐకెపి వీవోఏల రిలే నిరాహార దీక్షలు
పినపాక మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఐకెపి వీవోఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారానికి 9వ రోజుకు చేరుకున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ వీవోఏలు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిబ్బంది సమ్మె శిబిరాన్ని సందర్శించి వీవోఏలకు సంఘీభావం తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జ్యూస్ పంపిణీ చేసి మద్దతు ప్రకటించారు.