మంగళవారం, పినపాక మండలం జానంపేట గ్రామానికి సేవలందిస్తున్న 108 అంబులెన్స్ సేవలను జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఆడిట్ అధికారి కిషోర్ తనిఖీ చేశారు. పరికరాలు, మందుల లభ్యత, ఆక్సిజన్ నిల్వలను ఆయన పరిశీలించారు. గోల్డెన్ అవర్లో బాధితులను సకాలంలో ఆసుపత్రులకు చేర్చాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో భద్రాచలం డివిజన్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మనోహర్, రమ్యక్రిష్ణ, పైలట్ తేజ పాల్గొన్నారు.