పినపాక: నూతన అంగన్‌వాడీ భవనం ప్రారంభం

7చూసినవారు
పినపాక మండలంలోని సీతారాంపురం గ్రామపంచాయతీలో రూ. 12 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన అంగన్‌వాడీ భవనాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సర్పంచ్ సనప అనితతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్‌వాడీ కేంద్రాలు కీలకమని, గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు మెరుగైన విద్య, పోషకాహారం, ఆరోగ్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్