పినపాకలో జరుగుతున్న 69వ అండర్-17 జాతీయ కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. శనివారం జరిగిన మ్యాచ్‌లో విద్యా భారతి జట్టుపై పంజాబ్ జట్టు విజయం సాధించింది. మరో మ్యాచ్ గెలిస్తే పంజాబ్ సెమీఫైనల్స్‌కు చేరుకుంటుంది. ఈ పోటీలను వీక్షించడానికి స్థానిక ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.