మంగళవారం పినపాక ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకం అమలుపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా అమలు చేయాలని, పనుల నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి అర్హుడైన కార్మికుడికి ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలని ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ సెక్రటరీలకు సూచించారు.