నిజమైన ఓటర్లను గుర్తించి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సర్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తహసీల్దార్ గోపాల కృష్ణ తెలిపారు. మంగళవారం పినపాక రైతు వేదికలో బిఎల్వోలతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలోని లోపాలను సరిదిద్దడం, డూప్లికేట్ ఓట్లను తొలగించడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యాలని ఆయన పేర్కొన్నారు.