పినపాక: పార్టీకి చెడ్డపేరు తెచ్చేవారిని ఉపేక్షించేది లేదు

2చూసినవారు
పినపాక: పార్టీకి చెడ్డపేరు తెచ్చేవారిని ఉపేక్షించేది లేదు
కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరిస్తూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు రామనాధం శుక్రవారం స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలపై ప్రచారంలోకి వచ్చిన వార్తలపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించిందని ఆయన అన్నారు. పార్టీ శ్రేణుల్లో క్రమశిక్షణ పాటించాలని, పార్టీ ప్రతిష్టను కాపాడాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్