పినపాక: పులుల గణన పకడ్బందీగా నిర్వహించాలి

10చూసినవారు
ఈ నెలలో జరగనున్న జాతీయ పులుల గణనను పకడ్బందీగా నిర్వహించాలని మణుగూరు ఎఫ్ఓ మక్సూద్ సూచించారు. పినపాక మండలం ఏడూళ్లబయ్యారం రేంజి కార్యాలయంలో అటవీ క్షేత్రాధికారి తేజ స్వీతో కలిసి సిబ్బందికి అవగాహన కల్పించారు. పాదముద్రలు, కెమెరా ట్రాప్‌ల ద్వారా డేటాను సేకరించాలని, వన్యప్రాణుల సంరక్షణలో పులుల గణన అత్యంత కీలకమని, సిబ్బంది సమన్వయంతో పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్