పినపాకలో జరుగుతున్న 69వ జాతీయ కబడ్డీ పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. ఆదివారం ఐదో రోజు జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో తెలంగాణ, ఉత్తరప్రదేశ్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో తెలంగాణపై ఉత్తరప్రదేశ్ జట్టు విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ పోటీలు కబడ్డీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.