పినపాక: ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి: సీఐ

3చూసినవారు
పినపాక: ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి: సీఐ
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఎటువంటి సంఘటనలు, ఘర్షణలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా జరగేందుకు గ్రామస్తులు పూర్తి సహకారం అందించాలని సీఐ వెంకటేశ్వరరావు కోరారు. బుధవారం పినపాక మండలం సీతారాంపురం గ్రామంలో డీఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై సురేష్‌తో కలిసి ఆయన ప్రజలకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో గొడవలు, దాడులు, అల్లర్లు జరగకుండా ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్