గుండాల మండలంలోని 33 కేవి మామకన్ను ఫీడర్ పై మరమ్మత్తుల కారణంగా మంగళవారం ఉదయం 7: 00 గంటల నుండి మధ్యాహ్నం 1: 00 వరకు గుండాల, ఆళ్లపల్లి మండలాలకు విద్యుత్ సరఫరా నిలిపిస్తున్నట్లు విద్యుత్ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు మండలాల విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విద్యుత్ శాఖ ఏఈ దనసరి రమేష్ కోరారు.