రేషన్ బియ్యం ఇకపై ప్రతి నెలా పంపిణీ

2360చూసినవారు
రేషన్ బియ్యం ఇకపై ప్రతి నెలా పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు నెలలకు ఒకసారి రేషన్ బియ్యం పంపిణీ విధానం రద్దు చేయబడింది. ఇకపై ప్రతి నెలా బియ్యం అందించేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. జులై నెల కోటాను విడుదల చేయగా, జులై 1 నుంచి జిల్లాలోని 443 రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ ప్రారంభం కానుంది. జిల్లాలో 3,26,606 రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులు తమ సమీప రేషన్ దుకాణాల్లో బియ్యం తీసుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్