
నేడు భారత్- అఫ్గాన్ మ్యాచ్.. అంతలోనే స్టార్ క్రికెటర్ తండ్రి మృతి
భారత్, అఫ్గానిస్థాన్ మధ్య నేటి నుంచి ప్రారంభం కానున్న మూడో వన్డేల సిరీస్కు ముందు అఫ్గాన్ జట్టులో విషాదం నెలకొంది. స్టార్ క్రికెటర్ దర్విష్ రసూలీ తండ్రి మరణించడంతో అతడు స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ శుక్రవారం ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ధృవీకరించారు. రసూలీ జూన్ 17న రెండో వన్డే నాటికి జట్టుతో చేరే అవకాశం ఉంది. అతడు లేకపోవడంతో అఫ్గాన్ జట్టు తుది ఎంపికకు 14 మంది ఆటగాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు.




