గిరిజనుల కష్టాలు తీర్చండి: ప్రజాదర్బార్లో సర్పంచ్ వినతి

191చూసినవారు
గిరిజనుల కష్టాలు తీర్చండి: ప్రజాదర్బార్లో సర్పంచ్ వినతి
బూర్గంపాడు మండలంలోని సారపాక, మోతెపట్టి నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీరాంపురం పాయం ఎస్టి కాలనీ, చింతకుంట ఆదివాసి గిరిజన ప్రజల సమస్యలను తీర్చాలని కోరుతూ, సారపాక పంచాయతీ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ ప్రజాదర్బార్లో వినతి పత్రం అందజేశారు. గత 35 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న సుమారు 400 మంది గిరిజనులకు పాఠశాల, ఆరోగ్య కేంద్రం, విద్యుత్, మంచినీరు, రోడ్డు, బాత్రూంలు వంటి కనీస వసతులు కల్పించాలని వారు కోరారు. స్థానిక అటవీ అధికారులు అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, 30 ఏళ్లుగా రోడ్డు సదుపాయం లేక గర్భిణీలు మరణించిన సందర్భాలున్నాయని సర్పంచ్ జిల్లా కలెక్టర్కు వివరించారు.

సంబంధిత పోస్ట్