బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశం బుధవారం పంచాయతీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ మాట్లాడుతూ, పాలకవర్గ సభ్యుల సహకారంతో గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.