మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సునీల్ మాట్లాడుతూ, సమాజంలో నెలసరిపై ఉన్న అపోహలు, అపహాస్యాన్ని తొలగించడమే జాతీయ ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవ లక్ష్యమని తెలిపారు. గురువారం పీహెచ్సీలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలు, కిశోర బాలికలు నెలసరి సమయంలో పరిశుభ్రత పాటించడం ద్వారా అనారోగ్య సమస్యలను అరికట్టవచ్చని ఆయన సూచించారు.