పినపాకలో కొనసాగుతున్న ప్రత్యేక హోమ కార్యక్రమాలు

5చూసినవారు
పినపాక మండలం ఉప్పాకలో మంగళవారం రామాలయ పునఃప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, ధ్వజస్తంభానికి భక్తులు విశేష పూజలు చేశారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో గ్రామస్తులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భజనలు, మంగళ వాయిద్యాలతో ఉప్పాక గ్రామం భక్తి వాతావరణంతో నిండిపోయింది.

ట్యాగ్స్ :