కరకగూడెం మండలంలో డ్రైనేజీ వ్యవస్థ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న డ్రైనేజీ కాలువ పూర్తిగా పూడిక పోవడం వల్లన దుర్గంధం వెదజల్లుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. అధికారుల కార్యాలయాల దగ్గరలో ఉన్న డ్రైనేజీ కాలువ పరిస్థితి ఇలా ఉంటే, గ్రామాల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిలిచిన మురుగు నీటితో దోమలు వ్యాపించి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయించాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.