పినపాకలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా 29 ఇళ్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలపై కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే సర్పంచ్ చందర్రావు ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.