కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామంలో వీధి దీపాలు పనిచేయక వీధులన్నీ చీకటి మయంగా మారుతున్నాయి. రాత్రి వేళల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు పాములు, విష కీటకాలు భయంతో పాదచారులు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, వెంటనే వీధి దీపాలకు మరమ్మతులు చేపట్టి కొత్త లైట్లు అమర్చాలని స్థానికులు కోరుతున్నారు.