స్వచ్ఛత హి సేవ 2026-27లో భాగంగా పినపాక జడ్పీహెచ్ఎస్లో శుక్రవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీపీఓ అనూష చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ నియంత్రణ, నీటి పొదుపు, మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో 25 మంది పాల్గొనగా, ముగ్గురికి బహుమతులు అందజేశారు. సర్పంచ్ బానోత్ సదర్లాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛతలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో ముత్యాలరావు, ఉపసర్పంచ్ ప్రకాశరావు, హెచ్ఎం యోగితావేణి పాల్గొన్నారు.