మణుగూరు మండలం ముత్యాలమ్మ నగర్ గ్రామంలో అక్రమంగా నిర్మించిన సెల్ టవర్ నిర్మాణం, అంతర్గత వీధులు, డ్రైనేజీ సమస్యలపై గ్రామ ప్రజలు సోమవారం మండలంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో కి ముత్యాలమ్మ నగర్ వార్డు సభ్యులు గుంటక వెంకటేశ్వర్లు, కొమరం భూపతి వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం వారు విజ్ఞప్తి చేశారు.