బూర్గంపాడు మండలంలో సుదీర్ఘకాలంగా సేవలందించిన సీనియర్ హెడ్ కానిస్టేబుల్ స్వామి ఏఎస్ఐ (ASI)గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ఏఎస్ఐగా పదోన్నతి సాధించిన స్వామికి పలువురు ప్రజాప్రతినిధులు, విలేకరులు శుభాకాంక్షలు తెలిపారు