కాంగ్రెస్ పాలనలో మహానీయులకు గౌరవం లేదు.. జుజ్జూరి నరేష్

2చూసినవారు
కాంగ్రెస్ పాలనలో మహానీయులకు గౌరవం లేదు.. జుజ్జూరి నరేష్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకలో కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగ నిర్మాతలకు తగిన గౌరవం దక్కడం లేదని బీజేపీ మండల అధ్యక్షుడు జుజ్జూరి నరేష్ సోమవారం ఆరోపించారు. కరకగూడెం సెంటర్‌లో భారతరత్న అంబేద్కర్ విగ్రహం ఎదుట చెత్త పేరుకుపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్నప్పటికీ చెత్తను తొలగించకపోవడం పారిశుద్ధ్య అధికారుల నిర్లక్ష్యమని మండిపడ్డారు. మహానీయుల విగ్రహాల వద్ద ఇలాంటి అసౌకర్యాలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్