పినపాకలో నాలుగు మండలాల అధికారులకు శిక్షణ తరగతులు

0చూసినవారు
పినపాకలో నాలుగు మండలాల అధికారులకు శిక్షణ తరగతులు
పినపాకలోని GVR ఫంక్షన్ హాల్‌లో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పినపాక, కరకగూడెం, అశ్వాపురం, మణుగూరు మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, MPDOలు, MPOలు, ఉపాధి హామీ పథక సిబ్బంది తప్పక హాజరుకావాలని పినపాక MPDO తెలిపారు. శిక్షణలో 'వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళిక' రూపకల్పన, ఉపాధి హామీ పథకం సంస్కరణలు, పేరు మార్పు అంశాలపై అవగాహన కల్పించనున్నారు.

సంబంధిత పోస్ట్