భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకలో బుధవారం సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ వివరాలను సరిగా నమోదు చేసుకోవాలని కోరారు. సారపాక శాఖ సమావేశంలో, బీఎల్‌వోలు ఫారాలు నింపడంలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూసుకోవాలని సూచించారు.