
మాజీ మంత్రి అప్పలనరసింహరాజు మృతిపై లోకేశ్ సంతాపం
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అప్పలనరసింహరాజు మృతి పట్ల మంత్రి లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన రాజు గారి సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. అప్పలనరసింహరాజు కుటుంబ సభ్యులకు లోకేశ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.




