కొనిజర్ల: సాగర్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం

2091చూసినవారు
కొనిజర్ల మండల పరిధిలోని సాగర్ కాలువలో బుధవారం సుమారు 30 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైంది. కాలువలో మృతదేహం తేలియాడుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వద్ద సెల్ ఫోన్ మాత్రమే దొరకగా, గుర్తింపు కార్డులు లభించలేదు. 'అన్నం సేవా ఫౌండేషన్' సహకారంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్