
కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇల్లందు మెయిన్ రోడ్ లోని శివాలయంలో కాశీ విశ్వేశ్వరుడి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేశారు. శివరాత్రి రోజున భక్తులు జాగారం, దీక్షలు చేయడానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.



































