టేకులపల్లిలో వడదెబ్బతో వృద్ధుడి మృతి

1చూసినవారు
టేకులపల్లిలో వడదెబ్బతో వృద్ధుడి మృతి
టేకులపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందిన సూరేపల్లి జయరామయ్య (62) బుధవారం వడదెబ్బతో మృతి చెందారు. తీవ్రమైన ఎండల కారణంగా అస్వస్థతకు గురైన ఆయన, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఇంటికి తిరిగి వచ్చారు. సాయంత్రం వాంతులు, విరోచనాలతో పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్