పిట్రోల్, డీజిల్ కొరతతో సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇల్లందు మండల కార్యదర్శి నరసింహారావు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ దొరక్క వ్యవసాయ పనులు స్తంభించిపోతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కొరత వల్ల ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.