ఇల్లందు మండలం కొమరారం లో శుక్రవారం, మే 1వ తేదీన మే డే దినోత్సవం సందర్భంగా IFTU హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు జై కార్మిక నినాదాలతో అమరుల స్మారక స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల అమలు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.