కొత్తగూడెం ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కలిసి వినతిపత్రం సమర్పించారు. గిరిజన పోడు రైతులకు పట్టాలు మంజూరు చేయాలని, కొమరారం, బోడు ప్రాంతాలను మండలాలగా, చారిత్రక ఇల్లందును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.