గురువారం ఇల్లెందు మండలంలోని మామిడిగూడెం పంచాయతీలో సీతానగరం గ్రామానికి చెందిన యుద్దమారి చంద్రమౌళి (55) అనే వ్యక్తి నిద్రమత్తులో ఇంటి ఆవరణలోని వినియోగంలో లేని బావిలో పడి మృతిచెందాడు. కుటుంబసభ్యులు, స్థానికులు అతన్ని ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.