
‘తీస్తా’ ప్రాజెక్టులో బంగ్లాదేశ్‌కు సహకరిస్తాం: చైనా
తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టుపై భారత్ వ్యక్తం చేసిన ఆందోళనలకు చైనా స్పందించింది. బంగ్లాదేశ్‌కు తన సహకారాన్ని పునరుద్ఘాటిస్తూ, ఈ విషయంలో మూడో పక్షం ప్రభావం తమపై ఉండదని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ తెలిపారు. తీస్తాను బంగ్లాదేశ్‌కు జీవనోపాధి ప్రాజెక్టుగా పేర్కొంటూ, దీనికి మద్దతుగా తన వంతు సాయం చేయడానికి చైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.




