నవంబర్ నెలకు నిర్దేశించిన 5.00 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంలో, ఇల్లందు ఏరియాలో 2.17 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించినట్లు ఇల్లందు సింగరేణి ఏరియా జీఎం వి. కృష్ణయ్య సోమవారం తెలిపారు. ఇది మొత్తం లక్ష్యంలో 43 శాతమని ఆయన పేర్కొన్నారు. ఏరియా కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను వెల్లడించారు.