గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా ఇల్లందు పట్టణ కేంద్రంలోని శ్రీ సత్యసాయి బాబా ఆలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. స్వామివారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.