ఖమ్మం నుంచి ఇల్లెందుకు ఓ వాహనంలో తీసుకువస్తున్న 53, 555 విలువైన గుట్కా ప్యాకెట్లను లలితాపురం వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మంలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి వీటిని కొనుగోలు చేసి తీసుకువస్తున్న ఇల్లెందు పట్టణానికి చెందిన శంకర్సాహు, డ్రైవర్ రాకేష్ కుమార్ పాసిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు ఎస్సై సూర్య తెలిపారు.