ఇల్లందు పట్టణంలో ఇఫ్ట్ ఆధ్వర్యంలో బుధవారం భగత్ సింగ్ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ కోడ్లు కార్మిక హక్కులను దెబ్బతీసే విధంగా ఉన్నాయని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం లేబర్ చట్టాలకు సంబంధించిన ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు.