భూమి ఆక్రమణపై ప్రశ్నించిన మహిళను కులం పేరుతో దూషించి, దాడి చేశారనే ఫిర్యాదుతో సాందయ్య, లక్ష్మి, సతీష్‌లపై ఇల్లందు సీఐ సురేష్ మంగళవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తిలక్ నగర్‌కు చెందిన సరోజ అనే మహిళ భూమిని ఆక్రమించుకుని భూపేష్ నగర్‌లో ముగ్గురు వ్యక్తులు సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమను నెలకొల్పారని, ప్రశ్నించినందుకు తనను దూషించి, దాడి చేశారని బాధితురాలు ఫిర్యాదు చేశారు.