'పాత పద్ధతిలోనే మెడికల్‌ బోర్డు నిర్వహించాలి'

0చూసినవారు
'పాత పద్ధతిలోనే మెడికల్‌ బోర్డు నిర్వహించాలి'
సింగరేణిలో పాత పద్ధతిలోనే మెడికల్ బోర్డును నిర్వహించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం భద్రాద్రి కొత్తగూడెంలోని అన్ని సింగరేణి ఏరియాల్లో ఆయా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. కొత్తగూడెం ఏరియాలోని పీవీకే5 గనిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ముఖాలకు నల్లరిబ్బన్లు కట్టుకొని, ప్లకార్డులతో ఆందోళన చేసి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి వట్టికొండ మల్లికార్జున్‌రావు మాట్లాడుతూ, కార్మికుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు కార్మిక వ్యతిరేకమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్