ఇల్లందు సమస్యలపై సీఎంను కలిసిన ఎమ్మెల్యే

70చూసినవారు
ఇల్లందు సమస్యలపై సీఎంను కలిసిన ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఇల్లందు నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించాలని, ఇందిరమ్మ గృహాలు అధికంగా మంజూరు చేయాలని కోరారు. సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మూల మధుకర్ రెడ్డి, తిరుమల ప్రభాకర్ రెడ్డి, భూక్య ప్రవీణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్