భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని మామిడిగూడెం గ్రామ పంచాయతీలో ఆదివారం సీతానగరంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమ కేంద్రాన్ని గ్రామపంచాయతీ సర్పంచ్ ఈసం బాలకృష్ణ సందర్శించి, పలువురు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేశారు. ఈ కార్యక్రమంలో రొంపేడు PHC సిబ్బంది, గ్రామపంచాయతీ పరిధిలోని ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.