టేకులపల్లి బ్యాంక్ మేనేజర్ రామకృష్ణను కఠినంగా శిక్షించాలని సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కుర్ర మోతిలాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ ఐజీ చంద్రశేఖర్ రెడ్డికి ఫిర్యాదు చేసి, పెద్ద తండాకు చెందిన మహిళ మృతికి కారణమైన మేనేజర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. మహిళను నమ్మించి శారీరకంగా వాడుకొని ఆమె మృతికి కారణమైన మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని సంఘం కోరింది.