టేకులపల్లి మండలంలో బుధవారం తుఫాను కారణంగా దెబ్బతిన్న వరి, పత్తి పంటలను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం పరిశీలించారు. రైతు గాంధీ వరి పొలాన్ని సందర్శించి, నీటి నిల్వ వల్ల పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని, వెంటనే నీటిని తొలగించి, వరి కోతను త్వరగా చేపట్టాలని రైతులకు సూచించారు.