టేకులపల్లి: వడదెబ్బతో రైతు మృతి

1చూసినవారు
టేకులపల్లి: వడదెబ్బతో రైతు మృతి
టేకులపల్లి మండలం దాసుతండా పంచాయతీకి చెందిన జాటోత్ భీమ్ జి (45) అనే రైతు వడదెబ్బతో శుక్రవారం మృతి చెందాడు. భీమ్ తనకున్న రెండు ఎకరాల పోడు భూమితో పాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. శుక్రవారం చేనులో పత్తి విత్తనాలు వేయిస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్