టేకులపల్లిలో మంగళవారం రాత్రి వీచిన గాలిదుమారానికి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. బుధవారం కొండంగుల బోడు గ్రామానికి చెందిన రైతులు తమ పశువులను మేత కోసం పొలానికి తీసుకెళ్లగా, పొలంలో పడి ఉన్న విద్యుత్ తీగలను తాకి ఐదు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఒక్కో పశువు విలువ సుమారు రూ. 80,000 వరకు ఉంటుందని బాధితులు తెలిపారు.