శుక్రవారం టేకులపల్లి మండల పరిధిలో గెలిచిన నూతన సర్పంచులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్లెడ్డి, ఎంపీ బలరాం నాయక్ ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఈ విజయానికి కారణమని వారు పేర్కొన్నారు. సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేలా పని చేయాలని సూచించారు.