టేకులపల్లి పీఏసీఎస్ కార్యాలయాన్ని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు శుక్రవారం సందర్శించి, సాగు సీజన్ దృష్ట్యా రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. గోదాములను ఉదయం 6 గంటలకే తెరిచి పంపిణీ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 406 కేంద్రాల ద్వారా ఎరువులు సరఫరా చేస్తున్నామని, నిర్ణీత ధర కంటే ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.