కోఠీ కాల్పుల ఘటన.. వెలుగులోకి మరో వీడియో

1చూసినవారు
TG: హైదరాబాద్ కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో దుండగులు ఓ వ్యక్తిపై గన్‌తో కాల్పులు జరిపి రూ.6 లక్షలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఘటనా స్థలం నుంచి పారిపోయిన నిందితులు కాచిగూడ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లినట్లు పోలీసులు నమ్మాలని అక్కడే స్కూటీ వదిలేశారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ డీమార్ట్ దగ్గర డ్రెస్ చేంజ్ చేసుకుని పారిపోయారు. సీసీ కెమెరాల ద్వారా ఏ రూట్ లో ఎక్కడికి వెళ్లారు? అనేదానిపై ఐదు పోలీస్ బృందాలు గాలిస్తున్నారు. వందలాది సీసీ కెమెరాలను పరిశీలిస్తూ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్